నవతెలంగాణ-ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాధనోపాధ్యాయులు డి రవీందర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జరిగే జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును డీఈవో అశోక్ కుమార్ చేతుల మీదుగా అందుకోనున్నారు. జిల్లాలోని వివిధ కేటగిరీల్లో మొత్తం 40 మంది ఎంపిక కాగా , వీరితోపాటు స్కూల్ అసిస్టెంట్ కేటగిరిలో కేజీబీవీ ప్రత్యేక అధికారిని గంగామణి, ఆలూరు మండల కేంద్రం నుండి గణేష్ , డొంకేశ్వర్ మండల కేంద్రం నుండి సాయిలు, ఎస్జీటీ కేటగిరిలో పట్టణం నుండి సునీత, వెల్మల్ నుండి ఎస్.కె అబ్దుల్ ,ఇస్సపల్లి నుండి రాజు తదితరులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రవీందర్ మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం అని అన్నారు.
జిల్లా స్థాయి ప్రధానోపాధ్యాయులుగా రవీందర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES