Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జోనల్ స్పోర్ట్స్ మీట్ విద్యార్థులకు రావులపల్లి పిహెచ్సి వైద్య సేవలు

జోనల్ స్పోర్ట్స్ మీట్ విద్యార్థులకు రావులపల్లి పిహెచ్సి వైద్య సేవలు

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
క్రీడాకారులకు వెంటనే ప్రథమ చికిత్స అందించడమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తక్షణ కర్తవ్యం అని వెలుగుపల్లి పల్లె దవాఖాన డాక్టర్ కుంభం విజయ్ కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో నిర్వహిస్తున్న 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ లోభాగంగా వైద్య బృందం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రధమ చికిత్స క్యాంపులో సేవలందించి మాట్లాడారు. క్రీడల సమయంలో గాయపడిన వారికి వెంటనే తక్షణ వైద్య సేవలందించామన్నారు. చిన్నచిన్న గాయాలు అయిన వారికి బ్యాండేజీలు,డ్రెస్సింగ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట హెల్త్ అసిస్టెంట్ నరసింహా చారి,ఏఎన్ఎంలు సరిత,శైలజ,ఆశా వర్కర్ రమాదేవి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -