దర్శకుడు, హీరో రవిబాబు తాజాగా ‘రేజర్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తన గత చిత్రం ‘ఏనుగుతొండం ఘటికాచలం’ వంటి లైట్-హార్టెడ్ సినిమాకు పూర్తి డిఫరెంట్‌గా, ఈసారి టెన్షన్, వైలెన్స్‌తో కూడిన డార్క్ వరల్డ్‌లోకి అడుగుపెడుతున్నారు
ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్ పతాకంపై సురేష్ బాబు ప్రెజెంట్ చేయగా, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ నిర్మిస్తోంది. రవిబాబు, సురేష్ బాబు కాంబినేషన్‌లో మరోసారి వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
దర్శకత్వంతో పాటు ఈ చిత్రంలో రవిబాబు హీరోగా కూడా నటిస్తుండటం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఒక పోస్టర్‌తో పాటు స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. గ్లింప్స్‌లో రవిబాబు వైలెంట్ అవతార్‌లో కనిపించారు. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు చూడని కథాంశంతో ‘రేజర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ వేసవిలో’రేజర్’ థియేటర్లలోకి రానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.
‘రేజర్’ షూటింగ్ పూర్తి
- Advertisement -
- Advertisement -



