Thursday, December 25, 2025
E-PAPER
Homeసినిమాప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే 'రేజర్‌'

ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే ‘రేజర్‌’

- Advertisement -

యూనిక్‌ స్టొరీ టెల్లింగ్‌, వైవిధ్యమైన కథలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు. ఆయన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘రేజర్‌’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆయన గత చిత్రం ‘ఎనుగుతొండం ఘటికాచలం’ వంటి లైట్‌హార్టెడ్‌ కామెడీకి పూర్తి భిన్నంగా, డార్క్‌ అండ్‌ గ్రిట్టీ క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోంది.
ఈ చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మాత సురేష్‌ బాబు నిర్మిస్తున్నారు. రవిబాబు, సురేష్‌ బాబు కాంబినేషన్‌లో మరోసారి వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

దర్శకత్వంతో పాటు ఈ చిత్రంలో రవిబాబు హీరోగా కూడా నటిస్తుండటం ప్రత్యేక ఆకర్షణ. తాజాగా విడుదలైన ‘రేజర్‌’ టైటిల్‌ గ్లింప్స్‌ ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిని రేకెత్తించింది. విజువల్స్‌ పూర్తిగా రా అండ్‌ బ్రూటల్‌ టోన్‌లో ఉండగా, రవిబాబు రౌడీలను ఎదుర్కొనే విధానం, రేజర్‌తో చేసే హింసాత్మక దాడులు వణుకు పుట్టించేలా ఉన్నాయి. ఈ గ్లింప్స్‌ ప్రతీకారంతో నిండిన క్రైమ్‌ కథ సూచిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా రవిబాబు కెరీర్‌లో మరో డిఫరెంట్‌ సినిమాగా నిలువనుంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -