నవతెలంగాణ – వనపర్తి
పానగల్ మండలంలోని రేమద్దుల గ్రామంలో ఆర్ అండ్ బి రహదారి ఇరువైపులా నివసిస్తున్న కుటుంబాలు తమ సమస్యలను వినిపించేందుకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంలో ఆ కుటుంబాలు, ఆర్ అండ్ బి రహదారి విస్తరణలో భాగంగా 35 పీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. అలాగే, పూర్తిగా ఇళ్లు కోల్పోయే కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఐద్వా కార్యదర్శి A లక్ష్మీ మాట్లాడుతూ, కొద్ది మొత్తంలో కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి, పూర్తిగా కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కూడా ఆమె స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఐద్వా కార్యదర్శి A లక్ష్మీతో పాటు DYFI జిల్లా ఉపాధ్యక్షుడు కమలాకర్, మహంకాళి లోకేష్, పుష్పావతి, రత్నమ్మ, కమ్మరి అరుణ, కటిక కిషన్, ఉప్పరి రాములు, మండ్ల నిరంజన్, సాయిలు, చెన్నయ్య, మంగలి బలరాం, రామేశ్వరమ్మ, బోయ చిట్టెమ్మ బాధితులు తదితరులు పాల్గొని అదనపు కలెక్టర్ గారికి విజ్ఞప్తి పత్రం అందజేశారు.