ఆర్‌బీఐ ఎంపీసీ భేటీ ప్రారంభం

RBI MPC meeting beginsన్యూఢిల్లీ : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ సంజరు మల్హోత్రా అధ్యక్షతన సోమవారం ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) భేటీ ప్రారంభమయ్యింది. ఈ ద్వైమాసిక పరపతి సమీక్షా సమావేశాల నిర్ణయా లను ఏప్రిల్‌ 9న వెల్లడించనున్నారు. గత పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 0.25 శాతం తగ్గించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మూడు రోజుల సమావేశంలో మరో పావు శాతం కోతకు వీలున్నట్టు నిపుణులు అంచనా వేస్తోన్నారు. భారత్‌పై అమెరికా టారిఫ్‌ల ప్రభావం, రూపాయి పతనం, మారకం నిల్వలపైనా విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది.

Spread the love