Wednesday, October 1, 2025
E-PAPER
Homeజాతీయంవడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం..

వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సామాన్యులు, రుణ గ్రహీతలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ద్రవ్య విధాన సమీక్షలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. కీలకమైన రెపో రేటును ప్రస్తుతం ఉన్న 5.5 శాతంగానే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలను వెల్లడించారు. దీంతో ఇప్పట్లో గృహ, వాహన, ఇతర రుణాలపై వడ్డీ రేట్లు (ఈఎంఐలు) తగ్గే అవకాశం కనిపించడం లేదు.

ద్రవ్య విధానంపై తటస్థ వైఖరినే కొనసాగించాలని కమిటీ నిర్ణయించినట్లు సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం, అదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం మధ్య సమతుల్యత సాధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. “గతంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాల పూర్తి ప్రభావం స్పష్టంగా కనిపించే వరకు వేచి చూడటం సమంజసమని భావిస్తున్నాము” అని ఆయన వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటికే 100 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించామని, ఆ ప్రయోజనాలు ఇంకా ఆర్థిక వ్యవస్థకు పూర్తిగా అందాల్సి ఉందని ఆయన గుర్తుచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -