Monday, April 6, 2026
E-PAPER
Homeఆటలుఆర్సీబీ అలవోకగా..

ఆర్సీబీ అలవోకగా..

- Advertisement -

43 పరుగులతో చెన్నైపై ఘన విజయం
బెంగళూరు 250/3, చెన్నై 207/10

బెంగళూరు : డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వరుసగా రెండో విజయం సాధించగా, చెన్నై సూపర్‌కింగ్స్‌ సీజన్‌లో హ్యాట్రిక్‌ పరాజయం చవిచూసింది. 251 పరుగుల ఛేదనలో సూపర్‌కింగ్స్‌ 19.4 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది. 43 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. సర్ఫరాజ్‌ ఖాన్‌ (50, 25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రశాంత్‌ వీర్‌ (43, 29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), జెమీ ఓవర్టన్‌ (37, 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించినా.. కీలక బ్యాటర్లు సంజు శాంసన్‌ (9), రుతురాజ్‌ గైక్వాడ్‌ (7), ఆయుశ్‌ మాత్రె (1), కార్తీక్‌ శర్మ (6), శివం దూబె (18) విఫలమయ్యారు.

ఆర్సీబీ బౌలర్లు జాకబ్‌ డఫ్పీ (2/58), భువనేశ్వర్‌ (3/41), అభినందన్‌ (2/30), కృనాల్‌ పాండ్య (2/36) క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 పరుగుల భారీ స్కోరు చేసింది. టిమ్‌ డెవిడ్‌ (70 నాటౌట్‌, 25 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లు), రజత్‌ పాటిదార్‌ (48 నాటౌట్‌, 19 బంతుల్లో 1 ఫోర్‌, 6 సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. ఫిల్‌ సాల్ట్‌ (46), విరాట్‌ కోహ్లి (28), దేవదత్‌ పడిక్కల్‌ (50) ఆకట్టుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -