Sunday, July 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆర్డిఓ

తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆర్డిఓ

- Advertisement -

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి శనివారం చౌటుప్పల్ మండలం తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ నిర్వహించారు. సందర్భంగా ఆర్డీవో శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సుల గురించి డిప్యూటీ తాసిల్దార్ సిద్ధార్థ కుమార్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భూభారతి లో వచ్చిన దరఖాస్తులను త్వరితిగతిన ఆన్లైన్ చేయాలని అధికారులను సూచించారు.చౌటుప్పల్ మండల పరిధిలో 15 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తే 14 ఇండ్లు లబ్ధిదారులు గోడ లెవల్లో కడుతున్నారని తెలిపారు. ఒక ఇల్లు బేస్మెంట్ లెవెల్ లో ఉందని ఆర్డిఓ శేఖర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -