- Advertisement -
నవతెలంగాణ – మర్రిగూడ: మండలంలోని శివన్నగూడ పోలింగ్ కేంద్రాన్ని గురువారం చండూర్ ఆర్డీవో శ్రీదేవి సందర్శించారు. పోలింగ్ సరళి, పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న మౌలిక సదుపాయాలు పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. నమోదైన పోలింగ్ శాతం వివరాలను ఎంపీడీవో మునయ్య ను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరగాలని,పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు తాహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, ఉదావత్ లచ్చిరాం, ఇతర సిబ్బంది ఉన్నారు.
- Advertisement -



