స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రజలకు తెలిసే విధంగా పనిచేయాలి..
పరకాల ఆర్డిఓ డాక్టర్ కే నారాయణ
నవతెలంగాణ – పరకాల
25 సంవత్సరాలు ఒకసారి నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని ప్రజలకు తెలిసే విధంగా రాజకీయ పార్టీ నాయకులు కృషి చేయాలని పరకాల ఆర్డిఓ డా. కే. నారాయణ పేర్కొన్నారు. గురువారం పరకాల పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో బి ఎల్ ఓ, రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, నేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి వివరించారు. ఫారం -6, 6A,7,8, బి ఎల్ ఓ యాప్, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ విధివిధానాలపై స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని, పొలిటికల్ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరకాల తహసిల్దార్ , ఏ ఈ ఆర్ ఓ విజయ లక్ష్మి , నాయబ్ తహసిల్దార్ సూర్యప్రకాష్ , సీనియర్ సహాయకులు యస్ భద్రయ్య,(ఎలక్షన్) బి రాంబాబు, ఎలక్షన్ ఆపరేటర్ పాల్గొనారు.
రాజకీయ నాయకులతో ఆర్డిఓ ప్రత్యేక సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES