Monday, September 22, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్‌ ఓటర్ల జాబితాలో మళ్లీ చేర్చండి

బీహార్‌ ఓటర్ల జాబితాలో మళ్లీ చేర్చండి

- Advertisement -

33 వేల మందికి పైగా దరఖాస్తు
ఆర్టీఐ ప్రశ్నలకు సమాధానమివ్వని ఈసీఐ
పాట్నా :
బీహార్‌లో కొనసాగుతున్న ఎన్నికల జాబితాల స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌)లో క్లెయిమ్‌ లు, అభ్యంతరాలను దాఖలు చేయడానికి కేవలం ఒక రోజు మాత్రమే మిగిలి ఉన్నది. భారత ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ఆదివారం (ఆగస్టు 31, 2025) 33,326 మంది ఓటర్ల జాబితాలో తిరిగి చేర్చడానికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. ఆగస్టు 1న ప్రచురించబడిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 7.24 కోట్ల మంది ఉన్నారు, సర్‌ ప్రక్రియ ప్రారంభానికి ముందు ప్రచురిం చిన ఓటర్ల జాబితా నుంచి 65 లక్షల పేర్లు తీసివేసింది. ఈసీ చర్యపై ప్రతిపక్షాలు, ప్రజలు, సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. అనంతరం ఓటర్ల జాబితాలో చేర్చాలని 33,326 మంది దరఖాస్తులు దాఖలు చేశారని, ఇటీవల 18 ఏండ్లు నిండి ఓటు వేయడానికి అర్హత సాధించిన కొత్త ఓటర్ల సంఖ్య పెరిగింది. 15,32,438 దరఖాస్తులు వచ్చాయని ఎన్నికల సంఘం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చబడిన పేర్లను సవాలు చేస్తూ 2,07,565 అభ్యంతరాలు దాఖలయ్యాయి.సోమవారం (సెప్టెంబర్‌ 1, 2025), ముసాయిదా జాబితాపై వాదనలు , అభ్యంతరాలను దాఖలు చేయడానికి గడువును పొడిగించాలని కోరుతూ రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ), ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనుంది.

ఆర్టీఐ ప్రశ్నలకు సమాధానం లేదు..
సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నలకు ప్రతిస్పందనగా,సర్‌ ప్రక్రియ ఆధారంగా నిర్వహించాలనే నిర్ణయం ఆధారంగా లేదా 2003లో చివరిగా ఇంటెన్సివ్‌ ఓటర్ల జాబితా సవరణ కోసం ఆర్డర్‌ కాపీని ఇవ్వటానికి ఈసీ నిరాకరించింది. పారదర్శకత కార్యకర్త అంజలి భరద్వాజ్‌ ఎన్నికల కమిషన్‌కు రెండు వేర్వేరు ఆర్టీఐలను దాఖలు చేశారు. మొదటి ఆర్టీఐలో.. కార్యకర్త 2025లో దేశవ్యాప్తంగా సర్‌ను ప్రారంభించాలని ఈసీ నిర్ణయించిన ఏదైనా స్వతంత్ర మదింపు లేదా అధ్యయనం లేదా విశ్లేషణ ఇవ్వాలని కోరారు. అలాగే సర్‌తో సంబంధం ఉన్న అన్ని ఫైళ్ల కాపీలను అందజే యాలని దరఖాస్తులో పేర్కోన్నారు. దాని ప్రతిస్పందనగా.. జూన్‌ 24 నాటి ఈసీ మార్గదర్శకాన్ని సూచించమని భరద్వాజ్‌ను కోరింది, ఇది లింక్‌ను అంది స్తూ దాని వెబ్‌సైట్‌లో ”స్వీయ వివరణాత్మకమైనది . అందుబాటులో ఉంది” అని పేర్కొంది. ”ఇంకా, కమిషన్‌లో ఎటువంటి (ఎస్‌ఐసీ) సమాచారం అందు బాటులో లేదు” అని అది పేర్కొంది.రెండవ ఆర్టీఐ దరఖాస్తులో.. 2003లో బీహార్‌లో ఓటర్ల జాబితాల ఇంటెన్సివ్‌ రివిజన్‌ నిర్వహించిన ఆర్డర్‌ లేదా నోటిఫికేషన్‌ కాపీని కోరారు. 2003లో ఆ ఇంటెన్సివ్‌ రివిజన్‌ కోసం జారీ చేసిన మార్గదర్శకాల కాపీని కూడా ఆమె కోరారు.కానీ ఈసీ నిరాకరించింది. జూన్‌ 24 నాటి ఆర్డర్‌కు లింక్‌ను మళ్ళీ అందించింది.కేంద్రఎన్నికల సంఘం వ్యవహరించినతీరు బీహార్‌ ఎన్నికలు ఎంత వరకు పారదర్శకంగా జరుగుతాయన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -