మేడారంలో గద్దెలపై మంత్రి సీతక్క మొదటి మొక్కులు
నవతెలంగాణ-తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఆదివాసీ సంస్కృతీ సాంప్రదాయాలతో బుధవారం తెల్లవారుజామున అత్యంత భక్తితో పూజారులు గోవిందరాజు, పగిడిద్దరాజు స్తంభాలను గద్దెలపై పునః ప్రతిష్టాపన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటూరునాగారం మండలం కొండయి నుంచి దెబ్బగట్ల వంశస్థులు, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పెనక వంశీయులతో పాటు ఆయా వంశస్తుల ఆచార సంప్రదాయాలతో సమ్మక్క సారలమ్మ పూజారులతో కలిసి ఉమ్మడిగా పూజలు నిర్వహించి ఆయా గద్దెలపై పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా గ్రామాల నుంచి ఆడబిడ్డలు మామిడి తోరణాలతో అలంకరించి డోలు వాయిద్యాల నడుమ మంగళహారతులతో స్వాగతం పలికి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఆయా గద్దెలపై రహస్య పూజలను నిర్వహించారు. అనంతరం మంత్రి ధనుసరి అనసూయ సీతక్క పూజలు నిర్వహించి మొదటి మొక్కులు సమర్పించి ఆశీర్వాదం పొందారు. అనంతరం ఆయా దేవతల పూజారులు కుటుంబ సభ్యులు మొక్కులు చెల్లించుకున్నారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా భక్తుల సౌకర్యార్థం ఒకే వరుస క్రమంలో దేవతల గద్దెలు ఉండాలని ప్రభుత్వం పూజారుల ఆలోచన విధానాన్ని అనుసరించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మొదటి ఘట్టం పూర్తయిందని మంత్రి తెలిపారు.
భక్తులు సునాయాసంగా సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజుల గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని ఆశీర్వాదం పొందే విధంగా అభివృద్ధి పరిచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుదీర్ రామ్ నాథ్ కేకాన్, మేడారం జాతర కార్యనిర్వాహణాధికారి వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.
గోవిందరాజు, పగిడిద్దరాజు స్తంభాల పున:ప్రతిష్ఠ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



