Thursday, February 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం98 మంది జీపీ కార్యదర్శులకు రీ పోస్టింగ్‌

98 మంది జీపీ కార్యదర్శులకు రీ పోస్టింగ్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నిబంధనలు పాటించకుండా ఎంపిక చేశారనీ 2021లో తొలగించిన 98 మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు తిరిగి పోస్టింగ్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2023లో హైకోర్ట్‌ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సర్కార్‌ ఆదేశించింది. ఈ మేరకు పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ డి.దివ్య బుధవారం సర్య్కూలర్‌ జారీ చేశారు. వివరాలోకి వెలితే 6,188 మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి గత ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అందులో 2 శాతం రిజర్వేషన్‌ కింద 172 స్పోర్ట్స్‌ కోట ఉద్యోగాలు కేటాయించబడ్డాయి. జీవో నెంబర్‌ 74 ప్రకారం వారిని ప్రభుత్వం ఎంపిక చేయలేదని ఆరోపిస్తూ కొంతమంది కోర్ట్‌ మెట్లెక్కారు.

విచారణ జరిపిన హైకోర్ట్‌ 174లో 98 మంది నియామకాలను రద్దు చేయాలని ఆదేశించింది. హైకోర్ట్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2021లో 98 మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను తొలగించింది. తిరిగి వారు కోర్ట్‌ కెళ్లగా 2023లో వారికి అనుకూలంగా డివిజన్‌ బెంచ్‌ తీర్పు చెప్పింది. అయితే గత సర్కార్‌ హైకోర్ట్‌ తీర్పును అమలు చేయకుండా తాత్సారం చేసింది. హైకోర్ట్‌ తీర్పు మేరకు తగిన చర్యలు తీసుకోవాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. సర్కార్‌ నిర్ణయం పట్ల పంచాయతీ కార్యదర్శుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వారు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -