Monday, March 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లక్ష్యాన్నీ చేరుకొని వివోలు.!

లక్ష్యాన్నీ చేరుకొని వివోలు.!

- Advertisement -

రికవరి చేసింది 70 శాతం..చేయాల్సింది 30 శాతం
మిగిలింది ఒక్కరోజే
నవతెలంగాణ – మల్హర్ రావు

సెర్చ్ (ఎస్ఈఆర్పీ) పేదరిక నిర్మూలన సంస్థ రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి కింద పని చేసే స్వయం సహాయక సంస్థ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ పేద కుటుంబం పేదరికాన్ని జయించేందుకు ఆర్థిక స్వావలంభన సాధించేందుకు ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) కార్యక్రమం అమలు చేస్తోంది. ముఖ్యంగా పేద ప్రజలను సంఘటితం చేయడం, స్వయం సహాయక సంఘాలుగా ఏర్పాటు చేయడం, ఆర్థిక సేవలు, ఉపాధి కల్పన, మానవ వికాసంలో భాగంగా ఆరోగ్యం, విద్య, పోషణ, మహిళా సాధికారతను సాధించడమే దీని లక్ష్యం.

లక్ష్యాన్ని చేరుకొని మండలం
మండలంలోని 15 గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 27 గ్రామ సంఘాల్లో స్త్రీ నిధి గ్రూపులతోపాటు 608 స్వయం సహాయక బృందాలు బ్యాంకు లింకేజీ గ్రూపులున్నాయి. ప్రస్తుత 2025-26వ ఆర్ధిక సంవత్సరాంతానికి స్త్రీనిధి సంఘాలకు 608 స్వయం సహాయక బృందాలకు రూ.2289.20 కోట్ల రుణ పరిమితి ఉండగా 284 స్వయం సహాయక బృందాలు రూ.2228.20 కోట్ల రుణాల పంపిణీ జరిగినప్పటికీ ఆర్థిక సంవత్సరాంతానికి  70.13 శాతం మాత్రమే చేరుకున్నారు. వందశాతం చేయడానికి ఇక రుణ రికవరికి ఒక్కరోజే మిగిలింది. ఇందులో క్లస్టర్ కోఆర్డినేటర్లు(సీసీ),మండల సమాఖ్య క్లస్టర్ కోఆర్డినేటర్లు(ఎంఎస్సీసీ) సభ్యులు నిత్యం సంఘాల్లో ఆర్థిక పరపతిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వందశాతం పూర్తియ్యేదని తెలుస్తోంది. టార్గెట్ 640 స్వయం సహాయక సంఘాలకు శ్రీనిధి రూ.4,92,68,973 ఇవ్వగా రికవరీ రూ.84,87,706 అయినట్లుగా తెలిసింది.

సభ్యుల సమిష్టి కృషితో.. ఏపీఎం..హనుమంతరావు
సభ్యులు సమష్టిగా కృషితోనే రుణ రికవరీలో 70.13 శాతానికి చేరుకున్నాం. వందశాతం పూర్తి చేస్తాం.గ్రూపుల పొదుపు చర్యల తీరుతెన్నులను పరిశీలిస్తూ రుణ పరపతి, రుణరికవరీ, ఇతరత్రా అంశాలను అంచనా వేసి రుణ మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాం. ఆర్థిక రుణాల పంపిణీతో మహిళల్లో పొదుపు చర్యలు, ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని ఆశిస్తున్నాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -