Thursday, May 8, 2025
Homeజాతీయంఆపరేషన్ సింధూర్ పై వివిధ పార్టీ నేతల స్పందన

ఆపరేషన్ సింధూర్ పై వివిధ పార్టీ నేతల స్పందన

- Advertisement -

‘‘సాయుధ దళాలు తీసుకున్న చర్య ఎంతో గర్వంగా ఉంది. వారి దృఢ సంకల్పాన్ని, ధైర్యాన్ని అభినందిస్తున్నాము’’
-కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

‘‘మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నా. భారత సైన్యానికి మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది. జై హింద్‌’’
– ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ

– ‘‘పాక్‌లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నాం’’ – కాంగ్రెస్‌ సీనియర్ నేత జైరాం రమేశ్

– ‘‘ఈ రోజు నా దేశం తీసుకున్న నిర్ణయంపై గర్వంగా ఉంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తమిళనాడు భారత సైన్యం వెంట నిలుస్తుంది. ఈ విషయంలో రాష్ట్రం దృఢ సంకల్పంతో ఉంది. జైహింద్‌’’ – తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్

-‘‘ఉగ్రవాదం మళ్లీ పుట్టకుండా భారత సైన్యం దానిని పూర్తిగా నిర్మూలించాలి. ప్రపంచంలో ఉన్న అన్నిరకాల ఉగ్రవాదాన్ని రూపుమాపాలి’’– శివసేన నేత ఆదిత్య ఠాక్రే

-‘‘ఉగ్రవాదం.. వేర్పాటువాదం ఎప్పటికీ మనుగడలో ఉండకూడదు. నేడు మన భారత సైన్యం తీసుకున్న చర్యలు చూసి గర్విస్తున్నాము’’ -ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌

-‘‘ఆపరేషన్ సిందూర్ పేరిట భారత సైన్యం తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నాం. ఈ విషయంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. పహల్గాంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు న్యాయం జరిగింది’’– మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే

-‘‘భారత సైన్యం చర్యల పట్ల గర్వంగా ఉన్నాం. ఉగ్రవాదంపై పోరాటంలో దేశం మొత్తం సాయుధ దళాలకు అండగా నిలుస్తుంది’’– ఆప్ అధినేత కేజ్రీవాల్

-‘‘విజయవంతంగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించినందుకు భారత సైన్యానికి అభినందనలు. ఈ పోరాటంలో దేశం మొత్తం భారత సైన్యానికి మద్దతుగా ఉంది’’– మాజీ సీఎం ఆతిశీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -