బాలచెలిమి సంపాదకులు ఎం.వేద కుమార్
చిన్న పుస్తకాల వెనుక వేలాది మంది కృషి : శాంతా సిన్హా
బుక్ ఫెయిర్‌లో బాలసాహిత్య కథల పుస్తకాల ఆవిష్కరణ
నవతెలంగాణ-ముషీరాబాద్
సెలఫోన్ ద్వారా ఊహపోతుందని.. పుస్తక పఠనం మరింత ఊహాశక్తిని పెంచుతుందని బాలచెలిమి సంపాదకులు మణికొండ వేద కుమార్ అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లోని కొంపెల్లి వెంకట్‌గౌడ్ వేదికలో సోమవారం చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమి, బాలచెలిమి మాసపత్రిక సంయుక్త నిర్వహణలో 8 బాలసాహిత్య కథల పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. బాలచెలిమి సంపాదకులు వేదకుమార్ అధ్యక్షత వహించి మాట్లాడారు. పిల్లల నైపుణ్యాలను వెలికి తీసి వాటిని బాలచెలిమి పత్రికలో ప్రచురిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 41 బాలచెలిమి గ్రంథాలయాలు పెట్టామని, త్వరలో 100 గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. జాతీయ స్థాయిలో పెద్దలకు, పిల్లలకు, యువకులకు కథల పోటీలు నిర్వహించి వాటిలో ఎంపికైన ఉత్తమ కథలకు బహుమతులు అందజేశామని తెలిపారు.
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మాజీ చైర్‌పర్సన్ శాంతాసిన్హా మాట్లాడుతూ.. ఈ చిన్న పుస్తకాలు రావడం వెనక వేలాది మంది మృషి ఉందన్నారు. సోషల్ మీడియాకు పోటీగా బాల సాహిత్యాన్ని పెడుతున్నామన్నారు. ఈ సందర్భంగా వేదకుమార్ కృషిని ప్రశంసించారు. ఓయూ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రఘు పుస్తకాలను విశ్లేషిస్తూ.. నిమిది పుస్తకాలు మూడు తరాలకు సారథ్యం వహిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ.. 30 ఏండ్ల కిందటి కంటే ఈనాడు బాల సాహిత్యం విరివిగా నాణ్యంగా వస్తోందన్నారు. కథ వస్తువులో మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. బుక్ ఫెయిర్ అధ్యక్షులు యాకూబ్, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఎన్.బాలాచారి వేదికను పంచు కున్నారు.చివరగా ప్రముఖులకు శాలువాలతో సత్కా రం, బాలచెలిమి పుస్తకాల కిట్లను అంద జేశారు. బాలచెలిమి కన్వీనర్ గరిపెల్లి అశోక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్ రాములు, చొక్కాపు వెంకటరమణ, ఆర్.వెంకటరెడ్డి, రామ్ రాజ్, అమరవాది నీరజ, పైడిమర్రి గిరిజ, వీఆర్ శర్మ, బాలసాహితీవేత్తలు తదితరులు పాల్గొన్నారు.
పుస్తక పఠనం ఊహాశక్తిని పెంచుతుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



