Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఅవగాహనకు పుస్తక పఠనం చాలా అవసరం

అవగాహనకు పుస్తక పఠనం చాలా అవసరం

- Advertisement -

– యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి
– భువనగిరిలో నవతెలంగాణ బుక్‌ఎగ్జిబిషన్‌ ప్రారంభం
నవతెలంగాణ-భువనగిరి

నేటి ఆధునిక సమాజంలో విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలంటే పుస్తక పఠనం చాలా అవసరమని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కోర్టు ముందు ఏర్పాటు చేసిన నవతెలంగాణ బుకహేౌస్‌ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పుస్తకం ఒక మంచి స్నేహితుడని చెప్పారు. సోషల్‌ మీడియా లేక ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా వచ్చిన వార్తలు సమగ్రంగా ఉండవని, దినపత్రికల్లో ప్రతి విషయం కూలంకుషంగా రాస్తారని తెలిపారు. పత్రికలు, పుస్తకాలు చదివి పోటీ పరీక్షల్లో రాణించొచ్చన్నారు. నవతెలంగాణ బుకహేౌస్‌ వారు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పుస్తకాలను ప్రదర్శనకు పెట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి బొల్లెపల్లి కుమార్‌, న్యాయవాది వెన్నెల, నవతెలంగాణ దినపత్రిక విలేకరులు ఉస్మాన్‌ షరీఫ్‌, కొలుపుల వివేకానంద, పాక జహంగీర్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యులు హమీద్‌, నాయకులు ఉడుత వెంకటేష్‌, ఎడ్ల శ్రీను, రియాజ్‌, బుక్‌ స్టాల్‌ నిర్వాహకులు రఘువరన్‌ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad