Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళల చైతన్యానికి చదువే ఆయుధం

మహిళల చైతన్యానికి చదువే ఆయుధం

- Advertisement -

– కమ్మర్ పల్లి సర్పంచ్ కొత్తపల్లి హారిక
– జూనియర్ కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మహిళలు చైతన్యవంతం కావాలంటే చదువు ఒక్కటే ఆయుధమని కమ్మర్ పల్లి సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కమ్మర్ పల్లి సర్పంచ్ కొత్తపల్లి హారిక, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొత్తపల్లి హారిక మాట్లాడుతూ మహిళలు చైతన్యవంతం కావాలంటే చదువు ఒక్కటే ఆయుధమన్నారు. మహిళలు సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కళాశాల మహిళా అధ్యాపకులైన వైష్ణవి, సుమతి, స్రవంతి లను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మధు, వెంకటేష్, గంగాధర్, మహేందర్, గంగారాం, శ్రీహరి, మురళీకృష్ణ, ఆనంద్ కిషోర్, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -