Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ బడులలో పఠన సామర్థ్యాలను పెంపొందించాలి

ప్రభుత్వ బడులలో పఠన సామర్థ్యాలను పెంపొందించాలి

- Advertisement -

– మండల విద్యాధికారి తిరుపతయ్య..
నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యర్థుల్లో పఠన సామర్థ్యాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎం ఈ ఓ  తిరుపతయ్య , కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు హన్మంత్ రెడ్డి అన్నారు. జుక్కల్ కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయులకు జుక్కల్ లోని ప్రైమరీ పాఠశాలలు శుక్రవారం నాడు ఏర్పాటుచేసిన కాంప్లెక్స్ సమావేశంలో ఎంఈఓ , కాంప్లెక్స్ హెచ్ఎంలు పాల్గొన్నారు. ఈ ఈ సందర్భంగా సమావేశంలో విద్యార్థులకు పాఠశాలలోని గ్రంధాలయంలోగలా కథల పుస్తకాలు ప్రతిరోజు చదివేలా ఒక పీరియడ్ ని కేటాయించాలని సూచించారు.  తద్వారా  పిల్లలకు చదవాలనే ఆశక్తి పెరుగుతుందని అన్నారు. 

అదేవిధంగా చదువులో కూడా పిల్లలు ఉత్తమ ప్రతిభ కనబరుస్తారని ఎం ఆర్ పి లు వి. శంకర్ , పి. సంజయ్ కుమార్ లు సమావేశానికి హాజరైన ఉపాధ్యాయులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం విద్యార్థుల సృజనాత్మకతను వెనక్క తీసేందుకే రాష్ట్ర విద్యాశాఖ అనుసారం జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు జుక్కల్ మండలంలో పఠన సామర్థ్యంపై ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగింది.

గ్రామీణ ప్రాంతాలలో నైపుణ్యం కలిగిన పేద విద్యార్థులు ఉన్నారని వారిని గుర్తించి విద్యార్థి మక్కువ పెరిగేందుకు ఈ కార్యక్రమం దూరదం పడుతుందని ఎంఈఓ తిరుపతయ్య పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి తో పాటు జుక్కల్, కౌలాస్, ఖండేబల్లూర్ కాంప్లెక్స్ లో ప్రధానోపాధ్యాయులు, మండలంలోని వివిధ పాఠశాలల ప్రభుత్వ ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -