Saturday, January 17, 2026
E-PAPER
Homeసినిమామరోసారి సందడికి రెడీ

మరోసారి సందడికి రెడీ

- Advertisement -

విజయ్, సమంత జంటగా అట్లీ దర్శకత్వంలో వి క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి థాను నిర్మించిన తమిళ చిత్రం ‘తెరి’. ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో ‘పోలీస్‌’ పేరుతో అనువాదమై, ప్రేక్షకుల హృదయాలను దోచుకుని సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ ‘చిత్రం ఈ నెల 23న రీ-రిలీజ్‌ కానుంది. ఈ చిత్రాన్ని నైజాం ప్రాంతంలో ఏషియన్‌ ఫిలిమ్స్‌, ఆంధ్రాలో సురేష్‌ మూవీస్‌ భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే రీ-రిలీజ్‌ వార్తతో సోషల్‌ మీడియాలో భారీ స్పందన వస్తుండగా, విజయ్ అభిమానులతో పాటు సినిమా ప్రేమికులు మరోసారి ఈ ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను థియేటర్లలో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తండ్రి, కూతురు అనుబంధం, పోలీస్‌ బ్యాక్‌డ్రాప్‌, భావోద్వేగాలు, యాక్షన్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను సమపాళ్లలో మేళవించి అట్లీ ఈ చిత్రాన్ని రూపొందించారు. విజయ్ ద్విపాత్రాభినయంలో మెప్పించగా, సమంత పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే మరో హీరోయిన్‌గా అమీ జాక్సన్‌ నటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -