Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంపేదల న్యాయ సమస్యల పరిష్కారానికి జైలుకైనా సిద్దమే..

పేదల న్యాయ సమస్యల పరిష్కారానికి జైలుకైనా సిద్దమే..

- Advertisement -


భూ పోరాటానికి సంపూర్ణ మద్దతు….
సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కనకయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
: ఏజెన్సీలో గిరిజనులకు భూమి దక్కాలంటే ప్రత్యక్ష పోరాటమే శిరోధార్యం అని,ఆక్రమణలో ఉండి సాగు చేస్తూనే దాన్ని పొందటానికి పోరాటం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య అన్నారు. గతంలో జిల్లా కలెక్టర్ ఆర్డర్స్ అమలు చేయాలని, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల ప్రకారం రామన్నగూడెం గ్రామ రెవిన్యూ సర్వే నెంబర్:30,36,39 లలో ఉన్న సాగు భూములను స్థానిక ఆదివాసీలకు అప్పగించాలని, రామన్నగూడెం  గిరిజనులు నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట తహసీల్దార్, అటవీ శాఖ రేంజర్ కార్యాలయాల ముందు సోమవారం ప్రారంభించిన నిరవధిక నిరసన దీక్షకు సీపీఐ(ఎం) మండలం కమిటీ ఆద్వర్యంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య నేతృత్వంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా కనకయ్య మాట్లాడుతూ ..నేల విడిచి సాము చేసిన చందంగా కాకుండా మనకు దక్కాల్సిన సాగు భూమి ఎక్కడ ఉందో దానిలో ఉండి, సాగు చేస్తూ ప్రత్యక్ష పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను గిరిజనులకు ఆయన వివరించారు. అనంతరం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ .. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా గిరిజనులు ఎదుర్కొంటున్న ఎలాంటి సమస్య పరిష్కారానికి అయినా సీపీఐ(ఎం) నిత్యం గిరిజనులకు అండగా ఉంటుందని ప్రకటించారు. గిరిజనుల న్యాయమైన సమస్యలు పరిష్కారానికి జైలుకు వెళ్ళడానికి అయినా సిద్ధమే నని ఆయన అన్నారు. వీరి వెంట జిల్లా కమిటీ సభ్యులు బి.చిరంజీవి, మండల కార్యదర్శి సోడెం ప్రసాద్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad