Saturday, May 10, 2025
Homeట్రెండింగ్ న్యూస్అవసరమైతే మళ్ళీ సైన్యంలో చేరేందుకు సిద్ధం: మంత్రి ఉత్తమ్

అవసరమైతే మళ్ళీ సైన్యంలో చేరేందుకు సిద్ధం: మంత్రి ఉత్తమ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరిన వేళ తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధుల చిట్‌చాట్ లో మాట్లాడుతూ.. తాను 16 ఏండ్లకే సైన్యంలో చేరి, మిగ్ 21 ఫైటర్ జెట్‌ పైలట్‌గా పనిచేశానని గుర్తు చేశారు. భారత్ – పాకిస్తాన్‌ దేశాల మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చుతోన్న వేళ మాజీ సైనికుల సేవలు అవసరమని పిలుపు వస్తే.. మరోసారి సైన్యంలో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అంతేకాదు.. పీవోకేను భారత్ సంపూర్ణంగా స్వాధీనం చేసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని అన్నారు. పాకిస్తాన్ సృష్టించిన ఉగ్రవాదులే ఆ దేశానికి సంకటంగా మారారని తెలిపారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పాకిస్తాన్ రెండు భాగాలు కావడం ఖాయంగా కనిపిస్తోందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -