- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్ రక్షణ కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అన్నారు. దేశానికి చెందిన 14 మిలియన్లకు పైగా ఇరాన్ ప్రజలతో పాటు తానూ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. కాల్పుల విరమణకు పలు దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే. అమెరికా తాత్కాలిక ఒప్పందాలకు అంగీకరించబోమని, తమ శాశ్వత డిమాండ్లు అంగీకరించాలని చెబుతోంది. తాను, తమ దేశ ప్రజలు ప్రాణత్యాగాలకు కూడా సిద్ధమని ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించడం చూస్తుంటే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి
- Advertisement -



