నవతెలంగాణ-హైదరాబాద్: కాశ్మీర్, జల వివాదం, ఉగ్రవాదంపై భారత్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రస్తుతం నాలుగు దేశాల పర్యటనలో ఉన్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో కలిసి షెహబాజ్ షరీఫ్ సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ.. కాశ్మీర్, జల వివాదం, ఉగ్రవాదంపై భారత్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాశ్మీర్ సమస్యను, నీటి సమస్యను.. అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వాణిజ్యం, ఉగ్రవాదం నిర్మూలనపై కూడా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. శాంతి ప్రయోజనాల కోసం భారత్‌తో శాంతి చర్చల్లో పాల్గొనడానికి సిద్ధమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను భారత్ అంగీకరిస్తే.. నిజంగానే వారు శాంతిని కోరుకుంటున్నారని అర్థమవుతుందని షరీఫ్ వ్యాఖ్యానించారు.
భారత్‌తో చర్చించేందుకు సిద్ధం: పాక్ ప్రధాని
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES