క్రీడాప్రాధికార సంస్థ చైర్మెన్ శివసేనా రెడ్డి
ముగిసిన ఎన్‌ఈసీసీ జేపీఎల్ రెండో సీజన్
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని, ఇది కేవలం క్రీడలతోనే సాకారం అవుతుందని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్) చైర్మెన్ కే. శివసేనా రెడ్డి అన్నారు. స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్‌జేఏటీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్‌ఈసీసీ- జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ (జేపీఎల్) రెండో సీజన్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శివసేనా రెడ్డి.. ప్రతి ఒక్కరు వ్యాయాయం కోసం రోజుకు కనీసం 30-60 నిమిషాలు కేటాయించాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉండగలమని తెలిపారు. జేపీఎల్ రెండో సీజన్ విజేతగా నిలిచిన సాక్షి జట్టు, రన్నరప్ టీవీ9 జట్టుకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు చాముండేశ్వర్‌నాథ్, ఎన్‌ఈసీసీ సీఓఓ ఏజిహిల్ కుమార్, స్పోర్టీవో డైరెక్టర్ వృశాంక్ రెడ్డి, ఇండీ రేసింగ్ యజమాని అభిషేక్‌రెడ్డి, ఎంఎల్‌ఆర్‌ఐటీ చైర్మెన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డితో కలిసి ఆయన బహుమతులు ప్రదానం చేశారు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన రమేశ్‌కు ఎంఎల్‌ఆర్ ఈవీ స్కూటర్‌ను చాముండేశ్వర్‌నాథ్ బహుమతిగా అందజేశారు.
మంత్రి వాకిటి అభినందనలు
జర్నలిస్ట్‌లు పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు జేపీఎల్ మంచి వేదిక అని, పాత్రికేయులు అందరికీ ఒకచోటకు చేర్చి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించటం అభినందనీయమని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. పాత్రికేయుల క్రీడా పోటీలకు ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని, జేపీఎల్ రెండో సీజన్‌ను విజయవంతంగా నిర్వహించిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణను ఆయన అభినందించారు.
క్రీడలతోనే ఆరోగ్య తెలంగాణ సాకారం
- Advertisement -
- Advertisement -



