Saturday, January 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీపీఆర్‌తో పునర్జన్మ

సీపీఆర్‌తో పునర్జన్మ

- Advertisement -

టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌గౌడ్‌

నవతెలంగాణ-బంజారాహిల్స్‌
గుండెపోటుతో ప్రాణాపాయంలో ఉన్న వారికి సకాలంలో సీపీఆర్‌ చేయడం ద్వారా వారికి పునర్జన్మ అందించినట్టు అవుతుందని టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు. కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌ ముందు శుక్రవారం నిర్వహించిన సీపీఆర్‌ శిక్షణ ప్రారంభోత్సవంలో మైనార్టీ శాఖ మంత్రి మహ్మద్‌ అజారుద్దీన్‌తో కలిసి ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సీపీఆర్‌ పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

రాష్ట్రంలో 2 లక్షల మందికి సీపీఆర్‌ శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ కంజర్ల విజయలక్ష్మి ఈ కార్యక్రమాన్ని చేపట్టడాన్ని అభినందిస్తున్నానన్నారు. ప్రతి గ్రామానికీ ఒక సీపీఆర్‌ అంబాసిడర్‌ను ఏర్పాటు చేసి గుండెపోటు మరణాలను తగ్గించాలని కోరుతున్నామన్నారు. మంత్రి మాట్లాడుతూ.. సీపీఆర్‌ నేర్చుకోవడం ద్వారా ఒకరి ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుందని తెలిపారు. ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరగడం బాధాకరం అన్నారు. ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపాలన్నారు. ప్రతి ఒక్కరూ సీపీఆర్‌ పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -