Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దినప్పుడే సర్పంచ్ గా గుర్తింపు

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దినప్పుడే సర్పంచ్ గా గుర్తింపు

- Advertisement -

– లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి అధ్యక్షులు లుక్క గంగాధర్ 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దినప్పుడే సర్పంచ్ గా గుర్తింపు వస్తుందని లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి మండల అధ్యక్షులు లుక్క గంగాధర్ అన్నారు.
ఈ అవకాశాన్ని సర్పంచులు సద్వినియోగపరుచుకొని గ్రామంలోని సమస్యలను సామరస్య దృక్పథంతో పరిష్కరించి, ప్రజల మన్నులను పొందాలని కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి కార్యాలయంలో మండల అధ్యక్షులు లుక్క గంగాధర్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడిన మండలంలోని 14 గ్రామ పంచాయతీల సర్పంచులకు సన్మానం చేశారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన నూతన సర్పంచులు ఈ కార్యక్రమానికి హాజరై లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి సభ్యుల ఆత్మీయ సత్కారాన్ని స్వీకరించారు.

సర్పంచులందరినీ శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి అధ్యక్షులు లుక్క గంగాధర్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల కనీస అవసరాలను తీర్చి మౌలిక వసతులను కల్పించడం ద్వారా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దినప్పుడే సర్పంచ్ లకు గుర్తింపు వస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సర్పంచులు సద్వినియోగపరుచుకొని గ్రామంలోని సమస్యలను సామరస్య దృక్పథంతో పరిష్కరించి ప్రజల మన్నులను పొందాలన్నారు.

మండలంలోని ఆయా గ్రామాలలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రానున్న కాలంలో వివిధ కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేపడుతున్నామన్నారు. సామాజిక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను కూడా చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి రేవతి నలిమెల గంగాధర్, కోశాధికారి తెడ్డు రమేష్, వైస్ ప్రెసిడెంట్ నోముల నరేందర్, పాలేపు నరసయ్య,  హైమద్, చింత ప్రదీప్, సుంకరి విజయ్ కుమార్, లయన్స్ క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -