హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ : స్థానిక సంస్థల ఎన్నికల విజయమే లక్ష్యంగా కార్యకర్త కష్టపడి పని చేయాలని, పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. బుధవారం బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం లో కోహెడ మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ గ్రామాలవారిగా కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించేలా కృషి చేయాలన్నారు. హుస్నాబాద్ లో గత కేసీఆర్ ప్రభుత్వం హాయంలోనే అభివృది జరిగిందన్నారు భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలతో మమేకమై అండగా ఉండాలని పిలుపునిచ్చారు
స్థానిక ఎన్నికల్లో కష్టపడ్డ కార్యకర్తకు గుర్తింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES