Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeఆటలుశాట్జ్‌ కోచ్‌లకు గుర్తింపు!

శాట్జ్‌ కోచ్‌లకు గుర్తింపు!

- Advertisement -

స్పోర్ట్స్‌ డే వేడుకల్లో ఉత్తమ కోచ్‌లకు పురస్కారాలు

నవతెలంగాణ-హైదరాబాద్‌ :
దశాబ్దాలుగా ఎటువంటి ఉద్యోగ భద్రత, ప్రోత్సాహకాలు లేకుండా తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్‌)లో పని చేస్తున్న కోచ్‌లకు ఎట్టకేలకు ఓ ఊరట గుర్తింపు లభించనుంది. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. గచ్చిబౌలి స్టేడియంలో జరిగే స్పోర్ట్స్‌ డే వేడుకల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టిన, నాణ్యమైన క్రీడాకారులను తయారు చేసిన శాట్జ్‌ కోచ్‌లకు ‘ఉత్తమ కోచ్‌’ అవార్డులను ప్రదానం చేయనున్నారు. మూడు విభాగాల్లో ఈ అవార్డును అందించేందుకు శాట్జ్‌ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉత్తమ కోచ్‌లుగా నిలిచిన వారికి మెమెంటోతో పాటు రూ.50 వేల ప్రోత్సాహకం అందించేందుకు కసరత్తు జరుగుతోంది. ఉత్తమ కోచ్‌ అవార్డు శాట్జ్‌ కోచ్‌ల్లో సరికొత్త ఉత్సాహం నింపనుందని చెప్పవచ్చు.

సైక్లింగ్‌ ర్యాలీకి గవర్నర్‌ బిష్ణుదేవ్‌ వర్మ
సైక్లింగ్‌ ర్యాలీకి గవర్నర్‌ బిష్ణుదేవ్‌ వర్మ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. జాతీయ క్రీడా దినోత్సవం వేడుకల్లో భాగంగా ఆగస్టు 31న ‘ఫిట్‌ ఇండియా సండేస్‌ ఆన్‌ సైకిల్‌’ కార్యక్రమం నిర్వహించనున్నారు. మంగళవారం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను కలిసిన తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్‌) చైర్మెన్‌ కే. శివసేనా రెడ్డి, ఎండీ సోనిబాలా దేవి.. సైక్లింగ్‌ ర్యాలీ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు. శాట్జ్‌ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన గవర్నర్‌.. ఫిట్‌ ఇండియా సండేస్‌ ఆన్‌ సైకిల్‌ కార్యక్రమానికి హాజరవుతానని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad