కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
నవతెలంగాణ స్పెషల్ కరస్పాండెంట్ బసవ పున్నయ్యకు అక్కినేని మీడియా అవార్డ్
నవతెలంగాణ-కల్చరల్
వృత్తిలో నిబద్ధత, అంకిత భావంతో పని చేసిన వారికి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందని కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. విఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ త్యాగరాయ గానసభ ప్రధాన వేదికపై శృతి లయ ఫౌండేషన్, సీల్ వెల్ కార్పొరేషన్ నిర్వహణలో అక్కినేని మీడియా విశిష్ట ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం సభ మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా నవతెలంగాణ స్పెషల్ కరస్పాండెంట్ బసవపున్నయ్య, అశోక్ కుమార్(బిగ్ టీవీ), కె.కృష్ణ ప్రసాద్(నమస్తే తెలంగాణ), శివరామ ప్రసాద్ (10టీవీ డిజిటల్), హేమసుందర్‌రావు(పాప్ కార్న్ మీడియా), అంజలి రెడ్డి (సాక్షి టీవీ), చంద్రిక(వీ6), నిషిత (టీవీ 9), ధన లక్ష్మి(10 టీవీ)కి పురస్కారాలను మంత్రి బహుకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంతో ఒత్తిడితో మీడియా రంగంలో పని చేస్తూ ప్రజల అభిమానం పొందుతున్న వారిని సత్కరించడం ముదావహం అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియో ప్రారంభం సందర్భంగా తన తండ్రి వెంకటస్వామి సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు ఎస్‌వీ సూర్య ప్రకాష్‌రావుకు అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. అధ్యక్షత వహించిన జర్నలిస్ట్ రఫీ మాట్లాడుతూ.. సాధారణంగా జర్నలిస్ట్‌ల శ్రమను గుర్తించరన్నారు. కొన్ని సంవత్సరాలుగా నిబద్ధతతో పనిచేస్తున్న వారికి అవార్డులు ప్రదానం చేస్తున్నామని తెలిపారు. అవార్డు గ్రహీత బసవపున్నయ్య మాట్లాడుతూ.. సమాజంలో రుగ్మతలు వెలికి తీయడం జర్నలిస్టుల బాధ్యత అన్నారు. కార్యక్రమంలో దైవజ్ఞ శర్మ, అనూహ్య రెడ్డి, కుసుమ భోగరాజు తదితరులు పాల్గొన్నారు.
వృత్తిలో నిబద్ధతతో పని చేసిన వారికి గుర్తింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES