Wednesday, February 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్రీడల్లో రాణించడం ద్వారా సమాజంలో గుర్తింపు

క్రీడల్లో రాణించడం ద్వారా సమాజంలో గుర్తింపు

- Advertisement -

– లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి అధ్యక్షులు గంగాధర్ 
– జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు సత్కారం 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
విద్యార్థులు క్రీడల్లో రాణించడం ద్వారా సమాజంలో గుర్తింపు పొందవచ్చని లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి అధ్యక్షులు గంగాధర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ కార్యాలయంలో జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొన్న 28మంది విద్యార్థులకు నిర్వహించిన సత్కారం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సందర్భంగా విద్యార్థులను శాలువాలతో ఘనంగా సత్కరించి, మెమొంటోలను అందజేశారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి లుక్క గంగాధర్ మాట్లాడుతూ మండలంలో క్రీడాకారులను ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో ఈ చిరు సత్కార కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.క్రీడలతోనే మానసిక స్థైర్యం, నాయకత్వ లక్షణాలు అలవాటుతాయన్నారు.

క్రీడలు మానసికస్థితి మెరుగుపరచుకోవడమే కాకుండా శారీరక దారుఢ్యాన్ని, స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడానికి ఉపయోగపడతాయన్నారు. చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు.గెలుపు ఓటములను క్రీడాస్ఫూర్తితో సమానంగా స్వీకరించాలని సూచించారు.నిజ జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను, కష్టనష్టాలను తట్టుకునే మానసిక స్థైర్యం క్రీడల ద్వారానే అలవడుతుందని తెలిపారు. శారీరక దృఢత్వంతో పాటు మెంటల్ ఎబిలిటీ కూడా క్రీడల వల్లే వస్తుందన్నారు. క్రీడాకారులకు తమ లయన్స్ క్లబ్ సహకారం ఎల్లప్పుడు ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవడం ద్వారా మళ్లీ లయన్స్ క్లబ్ సత్కారాలను పొందే అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి రేవతి నలిమేల గంగాధర్, కోశాధికారి తెడ్డు రమేష్, బద్దం రాజశేఖర్, చింత ప్రదీప్, సుంకరి విజయ్, గుండోజి రవీందర్, సింగరి రాజేశ్వర్, ప్రధానోపాధ్యాయులు సాయన్న, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -