Tuesday, October 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామీణ క్రీడలతో క్రీడాకారుల ప్రతిభకు గుర్తింపు

గ్రామీణ క్రీడలతో క్రీడాకారుల ప్రతిభకు గుర్తింపు

- Advertisement -

– యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలే
– క్రీడాకారులు క్రీడాస్పూర్తితో గొప్పస్తాయికి ఎదుగాలే
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌
నవతెలంగాణ – కాటారం

గ్రామీణ స్తాయిలో నిర్వహించే టోర్నమెంట్‌లతో క్రీడాకారుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. కాటారం మండలం శంకరంపల్లి గ్రామంలో నిర్వహించిన ఛాంపియన్‌ ట్రోపి సీజన్‌ 3 క్రికెట్‌ టోర్నమెంట్‌ బహుమతి కార్యక్రమంలో ఆయన పాల్గొని విజేతలు మొదటి బహుమతి “మధు దేవరాంపల్లి 11” టీం కెప్టెన్ గంధం రాజేంద్ర ప్రసాద్ కు మొదటి బహుమతి, “ట్రోపి పైటర్ ” కెప్టెన్ మారగోని శ్రవణ్ గౌడ్ టీం కు రెండవ బహుమతి అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ… ఒకప్పుడు ప్రపంచ స్థాయిలో నిర్వహించే క్రీడలు ఈనాడు గ్రామాల్లో ఆడుతున్నారంటే ఎంతో అభివృద్ది చెందామని సంతోషపడాలో లేక యువత చెడు వ్యసనాలకు అలవాటుపడి భవిష్యత్‌ను అంధకారం చేసుకుంటున్నారని భాదపడాలో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యంగా సెల్‌ ఫోన్‌తోనే యువత చెడు మార్గాల తొక్కుతున్నారని, సెల్‌ఫోన్‌లతో ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు ఉంటుందని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు.

క్రీడాస్పూర్తిని అలవర్చుకుని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ముఖ్యంగా గంజాయిలాంటి మత్తు పదార్థాలకు అలవాటుపడుతున్నారని, పూర్వం పెద్దలు మాత్రమే గంజాయి సేవించేవారని వినేవారమే కానీ ఏనాడు చూడలేదని, కానీ ఈనాడు యువత గంజాయి మత్తుకు అలవాటు పడుతున్నారని, ఇటీవల రామగిరి మండలంలో జరిగిన ఓ సంఘటన తనను చాలా బాధింపజేసిందన్నారు. మంథని తరహాలోనే శంకరంపల్లిలో ప్రతి ఏటా ఎవరి సాయం లేకున్నా క్రీడలు నిర్వహించుకోవడం అభినందనీయమని, ఈ క్రీడలకు బహుమతులు అందజేసిన కామెడి ప్రమోద్‌ను ఆయన ఈ సందర్బంగా అభినందించారు. గ్రామాల్లోని క్రీడాకారులు మండల, జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయికి ఎదుగాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమం లో బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు జక్కు రాకేష్, బీ ఆర్ ఎస్ కాటారం మండల అధ్యక్షులు జోడు శ్రీనివాస్, తోట జనార్దన్, వూర వెంకటేశ్వరరావు, కొండగొర్ల వెంకటస్వామి,అయిలి రాజబాపు, నరివేద్ది శ్రీనివాస్, జక్కు శ్రవణ్ కుమార్,ఉప్పు సంతోష్, వంగల రాజేంద్రచారీ, కొండపర్తి రమేష్, రామిళ్ల రాజబాపు,బండం లక్ష్మారెడ్డి, కాటారం రాజమౌళి, అత్కూరి బాలరాజు,, చాకినాల ప్రశాంత్,కుసుమ బాణయ్య, కొండపర్తి మురారి, తుటి మనోహర్, గాజుల విక్రమ్ కుమార్, కామిడి ప్రమోద్, జిమ్మిడా వంశీ, జిమ్మిడా సమ్మయ్య,జాగిరి మహేష్,అత్కూరి శంకర్ జావీద్ ఖాన్, తుల్సేగారి దేవేందర్, మహేష్,జానుగాం రాజబాపు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -