నవతెలంగాణ – బంజారా హిల్స్ : తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రజలను మెప్పించిన, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి సేవలందిస్తున్న హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మెన్ నందమూరి బాలకృష్ణ మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా బంజారా హిల్స్ బసవతారకం ఇండొ అమెరికన్ క్యాన్సర్, రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూట్ కుటుంబ సభ్యులు ట్రస్టు బోర్డు సభ్యులు, ఇతర సిబ్బంది వారికి శుభకాంక్షాలు తెలియజేస్తూ మాట్లాడారు. మంచితనం, ముక్కుసూటి మనస్తత్వం, వెరసి బాలయ్యకి ఈ పురస్కారం ఇంకో కొత్త బాధ్యతకు నాందిగా భావించాల్సిందేనని అభిప్రాయాన్ని వెల్లడించారు.
సేవలో జీవితాన్ని అంకితం చేసే బాధ్యతకు గుర్తింపు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES