Tuesday, March 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమూడో డిస్కం ఏర్పాటును పున: పరిశీలించండి

మూడో డిస్కం ఏర్పాటును పున: పరిశీలించండి

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వానికి టీజీపీఈజేఏసీ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో మూడో విద్యుత్‌ డిస్కం ఏర్పాటును పున:పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీజీపీఈజేఏసీ) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మెన్‌ సాయిబాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం హైదరాబాద్‌లోని దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్‌) సీఎండీ జితేష్‌ వీ పాటిల్‌ను కలిసి వినతి పత్రం అందించారు. అంతకు ముందు జరిగిన జేఏసీ సమావేశం రాష్ట్రంలో విద్యుత్‌ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేసింది.

విద్యుత్‌ రంగం మెరుగుదల కోసం చేపట్టే సవరణలకు జేఏసీ వ్యతిరేకం కాదనీ, అయితే విద్యుత్‌ సంస్కరణ చట్టం-2023 నిబంధనలు, విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ (ఈఆర్‌సీ), విద్యుత్‌ అప్పీల్లెట్‌ ట్రిబ్యునల్‌ చట్టాలకు అనుగుణంగా ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అలాగే వేతన సవరణ సంప్రదింపుల కమిటీ 2026ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మెన్‌ చైర్మన్‌ సాయిబాబా, నాయకులు తాజుద్దీన్‌, వజీర్‌, మహేష్‌, వెంకన్న గౌడ్‌, సుధాకర్‌ రెడ్డి, కుమారస్వామి, శ్యామహనోహర్‌, ఈశ్వర్‌ గౌడ్‌, కరుణాకర్‌ రెడ్డి, గోవర్ధన్‌, సత్యనారాయణ రావు, భాను ప్రకాష్‌, సురేష్‌ కుమార్‌, శ్రీనివాస్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -