Monday, June 30, 2025
E-PAPER
Homeకరీంనగర్రికార్డు స్థాయిలో వరిధాన్యం కొనుగోలు..

రికార్డు స్థాయిలో వరిధాన్యం కొనుగోలు..

- Advertisement -

ఈనెల 9న ఐకేపీ  మహిళా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతా సభ
190  వరి ధాన్యం కేంద్రాలు ఏర్పాటు.. నేటితో 190 కొనుగోలు కేంద్రాలు మూసివేత
నవతెలంగాణ – సిరిసిల్ల
: ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మహిళా సంఘాలకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఐకెపి కింద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధిక శాతం మంజూరు చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు కోసం 190 కేంద్రాలను ఎక్కువ మొత్తంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మహిళ  సంఘాల కు కేటాయించారు. అకాల వర్షాలు, వాతావరణ కారణాలతో రైతుల ధాన్యం ఉత్పత్తులు పాడవకూడదని ఉద్దేశంతో ఏప్రిల్ మొదటి వారంలో 242 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంబించి 42,119 రైతుల నుండి 625 కోట్ల విలువైన 2.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ను రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు.

మహిళా సంఘాల  ద్వారా రూ .470 కోట్ల విలువైన ధాన్యం సేకరణ… జిల్లాలో  190 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా 470 కోట్ల విలువైన  2.2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 32,556 రైతుల నుంచి సేకరించారు. వీటిలో మొత్తం 190 కేంద్రాలు సేకరణ అనంతరం మూసివేశారు. . వీటిలో 32,087 మంది రైతుల వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయగా, 415 కోట్ల రూపాయలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి. మిగతా రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు త్వరలో జమ కానున్నాయి.

మహిళా సంఘాలకు రూ. 6 కోట్ల కమిషన్… ఇందిరా మహిళా శక్తిలో భాగంగా దాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లాలో భారీ సంఖ్యలో కేటాయించగా, కొనుగోలు సజావుగా పూర్తి చేశారు. ధాన్యం సేకరణ తుది దశకు చేరుకుంది. ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు సేకరించిన ధాన్యం ఒక క్వింటాలుకు రూ.32 కమిషన్ గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన జిల్లాలోని మహిళా సంఘాలకు దాదాపు 6 కోట్ల రూపాయల కమిషన్ కింద దక్కనుంది. ఇంత కమిషన్ రావడానికి ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా కారణమని మహిళా సంఘాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.ఈ సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఈ నెల 9న జిల్లాలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల మహిళా సంఘాల సభ్యులు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు కృతజ్ఞతలు తెలుపుటకు  సభ ను నిర్వహించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -