- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి : జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పలుచోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కాగా, బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి శివారులో నిజామాబాద్- హైదరాబాద్ మార్గంలోని రైల్వే ట్రాక్ వరద ఉధృతికి కొట్టుకుపోయింది. రైల్వే ట్రాక్ తీవ్రంగా దెబ్బతినడంతో రైళ్ల రాకపోగులను నిలిపివేశారు. భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
- Advertisement -