- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్
భూభారతీ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని మండల తహశీల్దార్, సిబ్బందికి నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్ తెలిపారు. బుదవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు రికార్డులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. భారతి దరస్తులను ఏవిధంగా పరీక్షరిస్తున్నారో అధికారులకు అడిగి తెలుసుకొని, మరి కొన్ని సూచనలు చేశారు. ఆయనతో పాటు మండల తహశీల్దార్ శేఖర్, డిప్యూటీ తహశీల్దార్ పద్మలత, రెవెన్యూ ఇన్స్పెక్టర్ షఫీ, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -