- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 12 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధిత యజమానులకు అందజేసినట్లు నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయి రెడ్డి శుక్రవారం తెలిపారు. ఎస్సై సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెలలో ట్రైన్ లలో సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న వారి ఫోన్స్ లను సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా 12 ఫోనులను ట్రేస్ చేసి మొబైల్ యజమానులను పిలిపించి వారి ఫోన్స్ అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. ఇక ముందు కూడా ఎవరైనా ట్రైన్ లో టికెట్ ఉండి ఫోన్స్ పొగిట్టుకుంటే జి ఆర్ పి రైల్వే పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలన్నారు.
- Advertisement -