నవతెలంగాణ-హైదరాబాద్: భారత సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్స్, మిస్సైల్స్ తో పాక్ దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రాజస్థాన్ లోని మూడు నగరాలకు అధికారులు అత్యవసర రెడ్ అలెర్డ్ జారీ చేశారు. బార్మర్, శ్రీగంగానగర్, జోధ్ పూర్ సిటీలలో ఎమర్జెన్సీ పరిస్థితిని విధించారు. బార్మర్‌లోని అన్ని మార్కెట్లను మూసివేయాలని, ప్రజలు ఇళ్లకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ టీనా దాబీ పేర్కొన్నారు. ప్రజా కదలికలను తక్షణమే నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ అత్యవసర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీ గంగానగర్‌లో పూర్తి లాక్‌డౌన్ అమలులో ఉందని అధికారులు తెలిపారు. పౌరులు ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు. జిల్లా యంత్రాంగం, పోలీసుల అధికారిక సూచనలను పూర్తిగా పాటించాలని నివాసితులను కోరారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా జోధ్‌పూర్‌లోనూ కర్ఫ్యూ నెలకొంది.మార్కెట్లు మూసివేయాలని, ప్రతి ఒక్కరూ వెంటనే వారి ఇళ్లకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు.
రాజస్థాన్‌లో ఆ మూడు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES