Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుRed Alert : తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌

Red Alert : తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్రంలో పలు జిల్లాలకు ఇవాళ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసినట్లు వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు వాతావరణ శాఖ సంచాలకురాలు తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. వీటికి ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్టు నాగరత్న చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad