Saturday, November 15, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఎర్ర నక్షత్రం

ఎర్ర నక్షత్రం

- Advertisement -

ఇప్పుడు యుద్ధం
ముగిసిందనుకుంటే పొరపాటే…
ఇప్పుడిక ఆ ధైర్యం
అస్తమించిందనుకుంటే గ్రహపాటే…
యోధుడు కూలినా
లక్ష్యం గురితప్పలేదు
వీరుడు ఒరిగినా
వీరత్వం తొణకలేదు..
తూరుపెందుకో దు:ఖంతో
మరీ ఎరుపెక్కింది
సమరశంఖం తానే
ఒక ఘర్జనై ఎగిసి అతడి
గాథలే దిక్కులు పిక్కటిల్లేలా
పాడుతోంది…
శ్రామిక రైతాంగ బావుటా
సీతారాముడికి వీడ్కోలుగా
నింగికెగిసి సెల్యూట్‌ చేసింది!
ప్రజాతంత్ర లౌకికశక్తుల్ని
ఏకం చేసిన
అసమాన పోరాట పటిమ
శతకోటి ఎర్రసూర్య ప్రభలతో
ఉవ్వెత్తున ఎగిసిపడి
నింగిన వెలుగై నిలిచింది..
(కామ్రేడ్‌ సీతారాం ఏచూరికి నివాళి)

భీమవరపు పురుషోత్తమ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -