Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సైబర్ నేరగాళ్ల వలలో రెడ్డిపేట వాసి 

సైబర్ నేరగాళ్ల వలలో రెడ్డిపేట వాసి 

- Advertisement -

దశలవారిగా రూ.1 లక్షా 2వేల 960 కాజేసిన నేరగాళ్లు
సోషల్ మీడియాలో వచ్చే లింకులపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై రాజశేఖర్ 
నవతెలంగాణ-రామారెడ్డి 

సైబర్ నేరగాల వలలో రెడ్డి పెట్ వాసి మోసపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రెడ్డి పేట గ్రామానికి చెందిన కోడెగoట్ల రాజు సోషల్ మీడియాలో ముద్ర లోన్ యాడ్ రావడంతో, వివరాలను నమోదు చేశాడు. ఓ వ్యక్తి ఫోన్ చేసి లోన్ మంజూరు చేస్తామని నమ్మబలికి, రూ.7 ధఫాలుగా రూ .1,02,960 ఫోన్ పే ద్వారా పంపాడు. ఆ తర్వాత తను కోరిన లోన్ అమైంట్ రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చే లింకులను తాకరాదని, గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీలు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత వివరాలు అడిగిన ఇవ్వకూడదని, సూచించారు. ఎవరైనా మోసపోతే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -