Sunday, February 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా రెడ్డి ఆత్మీయ సమ్మేళనం 

ఘనంగా రెడ్డి ఆత్మీయ సమ్మేళనం 

- Advertisement -

రెడ్డి సంఘం సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు ఘనంగా సన్మానం
రెడ్డి సహకార సంఘం అధ్యక్షులు  గొట్టి ముక్కుల ఆది రెడ్డి
నవతెలంగాణ – నెల్లికుదురు 

మండలంలోని పార్వతమ్మ గూడెం గ్రామంలోని ఫంక్షన్ హాల్ లో రెడ్డి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఆ సంఘం అధ్యక్షుడు గొట్టిముక్కుల ఆది రెడ్డి తెలిపారు. ఆదివారం రెడ్డి సంగం సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు రెడ్డి సహకార సంఘం ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రెడ్డి సంఘం నుండి గెలుపొందిన సర్పంచులకు ఉప సర్పంచ్లకు వార్డు సభ్యులకు శుభాకాంక్షలు అని అన్నారు.

మన సంఘం అభివృద్ధి కోసం మనమందరం ఐక్యంగా ఉండి పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. సంఘం సమస్యలను గుర్తించి పరిష్కార మార్గంగా ముందుకు సాగుతున్నామని ప్రతి రెడ్డి వ్యక్తి ఏ ఆపదలో ఉన్న ఏ సమస్య వచ్చినా అందరం ఐక్యంగా ఉండి ప్రతి ఒక్క వ్యక్తి అభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి వెన్నం క్రాంతి కుమార్ రెడ్డి, ట్రెజరర్ సొంటి రెడ్డి వీరారెడ్డి, నాయకులు ఏదేళ్ల యాదవ రెడ్డి, నాయని సత్యపాల్ రెడ్డి, బీరవెల్లి యాదగిరి రెడ్డి, పర్నే ప్రభాకర్ రెడ్డి, తోపాటు వివిధ గ్రామాల రెడ్డి నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -