Saturday, October 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనారోగ్యంతో రెడ్డిస్ ల్యాబ్ కార్మికుడు మృతి

అనారోగ్యంతో రెడ్డిస్ ల్యాబ్ కార్మికుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ – మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని రవీంద్ర నగర్ కాలనీకి చెందిన రెడ్డిస్ ల్యాబ్ కార్మికుడు రెడ్డీస్ ల్యాబ్ సంఘం (సీఐటీయూ) సభ్యులు ఇరిగి వెంకటయ్య (52) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని శనివారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకటయ్య మృతదేహం పై సిఐటియు జెండా కప్పి నివాళులర్పించారు. రెడ్డీస్ ల్యాబ్ లో గత 30 సంవత్సరాలుగా కార్మికుడిగా పనిచేస్తూ సంఘం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు. ఉద్యోగంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని, ఆయన సంఘం సభ్యుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఆయన మృతి సంఘానికి తీరని లోటు అన్నారు. సంతాపం తెలిపిన వారిలో సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, సిపిఎం టూ టౌన్ కార్యదర్శి భావండ్ల పాండు, రెడ్డిస్ ల్యాబ్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఏ శ్రీనివాస్, జి.వేణుగోపాల్, సభ్యులు బి రాములు, సిహెచ్ వెంకటయ్య, సిహెచ్ ప్రసాద్, కే లింగయ్య, రామాంజనేయులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -