Thursday, July 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి..

ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి..

- Advertisement -

నవతెలంగాణ  – భువనగిరి
ఉప్పు వినియోగాన్ని తగ్గించడం ద్వారా హైపర్‌టెన్షన్‌ను నియంత్రించడమే లక్ష్యం అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం మనోహర్ తెలిపారు. బుధవారం  జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ ఆధ్వర్యంలో జిల్లాలోని మేడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు అసంక్రమిత వ్యాధులపై రెండు రోజుల శిక్షణ నిర్వహించారు. గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు హైబ్లడ్ ప్రెజర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ మొదలైన అసంక్రమిత వ్యాధులను ముందుగా గుర్తించి, సమయానికి ప్రాథమిక స్థాయిలో చికిత్స కల్పించగల సామర్థ్యాన్ని  కల్పించడమే నమ్మక్ ప్రాజెక్ట్ ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశం అన్నారు. భారతదేశంలో వేగంగా పెరుగుతున్న హైపర్‌టెన్షన్ సమస్యను అదుపులో పెట్టేందుకు ఇది రూపొందించబడిందన్నారు.

దీనిలో భాగంగా ఉప్పు వినియోగాన్ని పరిమితం చేయడం, ఆరోగ్యవంతమైన జీవనశైలిని ప్రోత్సహించడం, ఆరోగ్య కార్యకర్తల సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి చర్యలు చేపట్టబడుతున్నాయన్నారు. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా దినసరి ఉప్పు వినియోగాన్ని తగ్గించే విధంగా వ్యక్తులకు తెలియపరచడం ప్రాథమిక స్థాయిలో రక్తపోటు స్క్రీనింగ్ చేయడం పై అవగాహన కల్పించబడుతుందన్నారు. శిక్షణలో జాతీయ స్థాయి నిపుణులు పాల్గొని ప్రాక్టికల్ శిక్షణ, స్క్రీనింగ్ పద్ధతులు, నివేదికల తయారీ, ఫాలో-అప్ వ్యవస్థలపై వివరంగా సదస్సులు నిర్వహించారు. మిడిల్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు క్లినికల్ మేనేజ్‌మెంట్ టూల్స్, డిజిటల్ హెల్త్ రికార్డ్ నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వబడింది. ఈ శిక్షణ కార్యక్రమంలో  డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ శిల్పిని, డాక్టర్ యశోద, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సాయి శోభ, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ వీణ, డాక్టర్ సుమన్ కళ్యాణ్, ప్రోగ్రాం ఇన్చార్జి డాక్టర్   శ్రావణ్, మురళి, డా. కళ్యాణి , డా. లతిక , డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి డాక్టర్ సచేందర్ నాథ్ పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -