కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి ఉత్తమ్ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పెరుగుతున్న వరి ఉత్పత్తి, కేంద్రం కేటాయిస్తున్న ధాన్యం సేకరణకు మధ్య నెలకొన్న వ్యత్యాసాన్ని తగ్గించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు గురువారం ఆయన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి డిమాండ్లతో కూడిన లేఖ రాశారు. రైతులు నష్టానికి లోనుకాకుండా కాపాడుతూనే, అదనపు నిల్వలను నిర్వహించడంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని కోరారు. ఎఫ్‌సీఐ ముడి బియ్యం లక్ష్యాన్ని తగ్గించిందని పేర్కొన్నారు. రబీ సీజన్‌కు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉడికించేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 8.45 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇంకా సరఫరా కావాల్సి ఉందని పేర్కొన్నారు. దీని గడువు ఈ ఏడాది పిబ్రవరితో ముగిసిపోయిందని తెలిపారు.
తేమ స్థాయి తక్కువగా ఉన్న దానిని ఉడకబెట్టిన బియ్యంగా మార్చేందుకు కేంద్రం అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. రైస్ మిల్లర్లు కేవలం ఐదు శాతం మాత్రమే సరఫరా చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారనీ, దాన్ని ఆచరణలో పెట్టాలని సూచించారు. డిసెంబర్ 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఖరీఫ్, రబీ సీజన్ రెండింటిలోనూ వరి ఉత్పత్తిలో గణనీయంగా పెరిగిందని తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధర అందించడం, నష్టానికి అమ్ముకోకుండా నివారించేందుకు వికేంద్రీకృత సేకరణ పథకం కింద భారత ప్రభుత్వం తరపున వరిని సేకరిస్తోందని గుర్తు చేశారు. అయితే, కస్టమ్ మిల్డ్ రైస్, ఉడకబెట్టిన బియ్యం లక్ష్యాలను తగ్గించాలన్న కేంద్ర నిర్ణయంతో తెలంగాణ అదనపు నిల్వలు, నిల్వ ఖర్చులు, మిల్లింగ్ ఖర్చులు, వడ్డీ బాధ్యతలతో సతమతమవుతోందని గుర్తు చేశారు. లక్షలాది మంది రైతులను కాపాడేందుకు సేకరణ కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ధాన్యం ఉత్పతి, కేటాయింపుల వ్యత్యాసాన్ని తగ్గించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



