Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కౌలాస్ నాళా ప్రాజెక్టుకు తగ్గిన వరద ఇన్ ఫ్లో..

కౌలాస్ నాళా ప్రాజెక్టుకు తగ్గిన వరద ఇన్ ఫ్లో..

- Advertisement -

– గత నాలుగు రోజులుగా ఇన్ ప్లో హెచ్చు , తగ్గులు..
నవతెలంగాణ – జుక్కల్

జుక్కల్ మండల రైతులకు వరప్రసాదంగా ఉన్న కౌలాస్ నాలా మధ్యతరః ప్రాజెక్టు కు గత వారం రోజులుగా ఇన్ ఫ్లో లో భారీగా హెచ్చుతగ్గులు కనిపిస్తూ వస్తున్నాయి. ప్రాజెక్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు , కెపాసిటీ 1.237 టీఎంసీలు ఉంది. గత నాలుగు రోజులుగా ప్రాజెక్ట్ అధికారులు తెలిపిన  వివరాలు సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం 10 గంటలకు ఇన్ ప్లొ 938 క్యూసెక్కులు వచ్చాయి. ఒక వరద గేటు ద్వారా 8 38 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా,  ప్రధాన కాలువ గుండా వంద క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇదే రోజు మధ్యాహ్నం 11గః 45 ని” అమాంతరంగా 3473 క్యూసెక్కుల వరద నీరు భారీగా ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో రెండు వరద గేట్లు  ఓపెన్ చేసి దిగువకు 2710 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

సెప్టెంబర్ 12వ తేదీన 3548 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో  12గః30ని” వచ్చి చేరడంతో మూడు గేట్లు ఓపెన్ చేసి దిగువకు 3548 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 12వ తేదీన రోజు మధ్యాహ్నం1గంః 30ని” ల సమయం లో  వరద నీరు ఇన్ ఫ్లో తగ్గిపోవడంతో మూడూ గేట్ల ద్వారా 4065 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 12వ తేదీ సాయంకాలం నాలుగన్నర సమయంలో రెండు గేట్ల ద్వారా2180 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 12వ తేదీ సాయంకాలం 6 గంటల ప్రాంతంలో ఒక గేటు ద్వారా 833 క్యూసెక్కుల నీటిని దిగువకు వరద గేట్ల ద్వారా విడుదల చేశారు. సెప్టెంబర్ 13వ తేదీ న అన్ని గేట్లు మూసివేసి వరద కాలువ ద్వారా ఉదయం 6 గంటల సమయం లో నీటిని వంద క్యూసెక్కులు విడుదల చేసినారు. సెప్టెంబర్ 14వ తేదీన ఉదయం 6 గంటల ప్రాంతంలో ఒక గేటు ఓపెన్ చేసి దిగువకు వరద గేట్ల ద్వారా 225 క్యూసెక్కుల  మరియు ప్రధాన కాలువ గుండా వంద క్యూసక్కుల నీరు మొత్తం కలిపి 325 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -