– రెండు గేట్ల ద్వారా నీటి విడుదల
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కౌలాస్ నాళా ప్రాజెక్టుకు ఎగువ నుండి ఇన్ ఫ్లో తగ్గిపోయింది. రెండు వరద గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు ఏఈఈ సుకుమార్ రెడ్డి తెలిపారు. వివరాల ప్రకారం ఉదయం ఆరు గంటల సమయానికి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు కాగా ప్రస్తుతం 457. 60 మీటర్లు ఉందని అన్నారు. ప్రాజెక్టు కెపాసిటీ 1.237 టీఎంసీలు ఉందని తెలిపారు. ఇన్ ఫ్లో 1403 క్యూసెక్కులు ఉన్నాయని, ఒక వరద గేటు తెరిచి ఉంచి దాని ద్వారా దిగువకు 1303 క్యూసెక్కుల విడుదల చేస్తున్నామని, మెయిన్ కెనాల్ ద్వారా 100 కేసెక్కుల నీటిని తరలిస్తున్నామని, మొత్తం కలిపి 1403 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ ఏఈఈ సుకుమార్ పేర్కొన్నారు.