వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా సంఘటనలు, వార్తలు, అభిప్రాయాలు, వీడియోలు విరివిగా షేర్ అవుతుంటాయి. అందులో ముఖ్యంగా యూట్యూబ్‌లో వస్తున్న వీడి యోలను చిన్న, చిన్న వీడియోలుగా మార్చి రీల్స్ రూపంలో విడుదల చేస్తారు. ఎంత పెద్ద విషయాన్నైనా రీల్స్ ద్వారా సులువుగా అర్థమవుతుంది. వీటికి భాష అవసరం లేదు, భావం అర్థమైతే చాలు. ఇవి డౌన్‌లోడ్ చేసేందుకు పెద్ద సమయం కూడా పట్టదు. దీంతో రీల్స్ చాలా పాపులార్టీ పొందాయి. పిల్లల నుంచి పెద్దల వరకు వీటిని చూస్తూ టైంపాస్ చేస్తున్నారు. మన మైండ్‌లో ఏముందో, దేన్నైతే సెర్చ్ చేస్తామో అవే వీడియోలు కుప్పలు, తెప్పలుగా వచ్చి పడుతుంటాయి. కానీ, వాటిని చూడటం చాలా సమయం పడుతుంది. రీల్స్‌ను రోల్స్ చేయడం సెకండ్లలో పని. కాబట్టి తక్కువ సమయంలో సమాచారాన్ని తెలుసుకోవడం రీల్స్ ద్వారా సాధ్యమవుతుంది. అందుకే విపరీతంగా రోల్స్ చేస్తున్నారు. గంటలకొద్ది రోల్స్ చేసి, చేసి దానికి అడిక్ట్ అవుతున్నారు. బంధువులు, స్నేహితులు ‘మా పిల్ల్లలు రీల్స్ రోల్స్ చేస్తూ గడిపేస్తున్నారు. పుస్తకాలను పక్కనపెట్టి రీల్స్ చూస్తున్నారు. పుస్తకాల మధ్య ఫోన్ పెట్టుకుని, దుప్పటికప్పుకుని రీల్స్ చూస్తూ టైమ్‌పాస్ చేస్తున్నారు’ అని మాట్లాడుకుంటున్నారు. కానీ, ఏడాదిలోపు పిల్లలకు కూడా మనం వీడియోలు చూపించి సంతోషపెడుతున్నాం. ఇంటిపనులు చేసుకోవడానికి వారికి దాన్ని అలవాటు చేస్తున్నాం. అంతేకాకుండా పిల్లల ముందే రీల్స్ రోల్స్ చేస్తున్నాం. దాని ప్రభావం పిల్లలపై పడదా? కచ్చితంగా ఉంటుందని మానసిక వైద్యులు చెబుతున్నారు. రీల్స్‌తో చాలామంది పిల్లల్లో మానసికి ఒత్తిడి పెరుగుతోంది. భవిష్య త్తులో దీనిపై ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది. దీనికి పరిష్కారం గుగుల్‌లోనో, డాక్టర్ల దగ్గరో లేదు. మనచేతుల్లోనే ఉంది. అదేనండీ..రీల్స్ రోల్స్ చేయకపోవడం.
-గుడిగ రఘు
రీల్స్… రోల్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



